Share News

నేరుగా ప్రధాని మోదీ రాజీనామాను అడగండి.. సీజేపీకి కేజ్రీవాల్ సలహా

ABN , Publish Date - Sep 28 , 2026 | 09:56 PM

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నేరుగా ప్రధాని మోదీ రాజీనామా కోసం డిమాండ్ చేయండి’ అని ఆయన సీజేపీకి సలహా ఇచ్చారు.

నేరుగా ప్రధాని మోదీ రాజీనామాను అడగండి.. సీజేపీకి కేజ్రీవాల్ సలహా
Kejriwal

ఇంటర్నెట్ డెస్క్: భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, లేకుంటే తాము అక్టోబర్ 2న భారీ నిరసన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రకటించిన నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నేరుగా ప్రధాని మోదీ రాజీనామా కోసం డిమాండ్ చేయండి’ అని ఆయన సలహా ఇచ్చారు. సోమవారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.


‘మొదట మీరు (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతున్నారు. ఇవన్నీ ఎందుకు? నేరుగా బాస్ (మోదీ) రాజీనామా చేయాలని నిరసన చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ ఆయన ఆజ్ఞలతోనే జరిగాయి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇకపై నిరసనలు మోదీ రాజీనామా కోసం జరుగుతాయని క్యాప్షన్ పెట్టారు.


కాగా ‘సర్’ ప్రక్రియలో పలు అంశాలపై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం చుట్టూ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అక్టోబర్ 2న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీజేపీ వ్వవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు.


ఈ వార్తలూ చదవండి

ఇలాంటి ప్రభుత్వానికా నేను మద్దతు ఇచ్చింది: చిరాగ్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Updated Date - Sep 28 , 2026 | 09:56 PM