చిత్తూరులో గజరాజుల సంచారం.. కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలని పవన్ ఆదేశాలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:56 PM
చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అమరావతి, సెప్టెంబర్ 28: చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మానవ-ఏనుగు మధ్య ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
కుంకీ ఏనుగులని రంగంలోకి దించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ సహకారంతో ఏనుగుల సంచారంపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఏనుగుల సంచారం ఆధారంగా పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. పంట నష్టం జరిగిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్
బీసీలను అణగదొక్కేందుకే రిజర్వేషన్లను తగ్గించారు.. జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
Read Latest AP News And Telugu News