Share News

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:18 PM

ఏపీలో SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పురోగతి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.25 లక్షల నోటీసులకు విచారణ పూర్తైంది.

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి
AP SIR

అమరావతి, సెప్టెంబర్ 28: రాష్ట్రంలో SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పురోగతి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.25 లక్షల నోటీసులకు విచారణ పూర్తైంది. దీంతో మొత్తం 99.92 శాతం నోటీసుల విచారణ పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 3,629 నోటీసులు మాత్రమే విచారణకు మిగిలి ఉన్నాయి. తిరుపతి, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన నోటీసుల విచారణ పెండింగ్‌లో ఉంది. తిరుపతి జిల్లాలో 2,477 నోటీసులు విచారణకు మిగిలి ఉండగా.. ఎన్టీఆర్ జిల్లాలో 486, అనంతపురంలో 257, పల్నాడులో 205, ప్రకాశంలో109 నోటీసులు విచారణకు పెండింగ్‌లో ఉన్నాయి. గుంటూరు, నెల్లూరు, నంద్యాల, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో అత్యల్పంగా పెండింగ్‌లో ఉన్నాయి.


ఇక, ఓటర్ల ఫొటో క్వాలిటీ చెక్‌లో 99.77 శాతం ఆమోదం పొందాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.71 కోట్ల మంది ఓటర్ల ఫొటోలను బీఎల్‌ఓలు పరిశీలించగా.. 3.70 కోట్ల మంది ఓటర్ల ఫొటో క్వాలిటీకి ఆమోదం లభించింది. ఫొటో క్వాలిటీ చెక్‌లో కేవలం 0.23 శాతం పెండింగ్‌లో ఉంది. ఎన్టీఆర్, అనంతపురం, నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో మరింత వేగం పెంచాలని అధికారులు సూచించారు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.


ఏపీవ్యాప్తంగా ఫారం-6 దరఖాస్తుల్లో 79,779 పెండింగ్‌లో ఉన్నాయి. ఫారం-6 పెండింగ్‌లో తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో అధికంగా కేసులు ఉన్నాయి. తిరుపతిలో 12,913, నెల్లూరులో 9,904, వైఎస్సార్‌లో 9,118, ప్రకాశంలో 7,321, సత్యసాయి జిల్లాలో 5,441 ఫారం-6 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, ఫారం-6A దరఖాస్తులు 899, ఫారం-7 దరఖాస్తులు 9,035, ఫారం-8 దరఖాస్తులు 37,890 పెండింగ్‌లో ఉన్నాయి. SIR ప్రక్రియలో మిగిలిన పనులపై అధికారులు దృష్టిసారించారు. బీఎల్‌ఓతో కాల్ బుక్ చేసుకునే అభ్యర్థనల్లో మొత్తం పెండెన్సీ 276గా ఉండగా.. వీటిలో 48 గంటలు దాటిన బుక్ ఏ కాల్ కేసులు 84 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై భారీ అప్పులు.. దంపతుల బలవన్మరణం

వివేకా హత్య కేసులో ఈడీ విచారణ.. ఎర్ర గంగిరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 01:22 PM