Share News

విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:41 PM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈఏడాది 25 లక్షల మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

విజయవాడ దసరాకు 25 లక్షల మంది భక్తులు.. ఏఐతో నిఘా: మంత్రి సత్యకుమార్
Vijayawada Dasara

విజయవాడ, సెప్టెంబర్ 28: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈఏడాది 25 లక్షల మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు(సోమవారం) దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల 4వ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా దసరా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రతీరోజూ సగటున 2 లక్షల భక్తులు దుర్గగుడికి వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వెయిటింగ్ ఏరియాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించచ్చని.. లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని నిర్ణయించామని తెలిపారు. త్రాగునీరు, వేడిపాలు, బిస్కెట్లు, ఆహార పదార్థాలు ఉంటాయన్నారు. వైద్య సిబ్బందిని ప్రతిచోటా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దసరాతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.


ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని మంత్రి తెలిపారు. ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. క్యూలైన్లలో వెయిటింగ్ తగ్గించడం, భక్తులకు మార్గాలు తెలిసేలా ప్రాచుర్యం చేస్తామని తెలిపారు. ప్రసాదం ఏటీఎంల ఏర్పాటు విషయంలోనూ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవార్చన మొదలైన ఆర్జిత సేవల టికెట్లు ఆన్‌లైన్లో, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చని తెలిపారు. పరోక్ష సేవలకు కూడా టికెట్లు ఉంటాయని.. నగరోత్సవం కూడా ఉంటుందని చెప్పారు. ఆధునిక ప్రసాదాల‌ తయారీ కూడా ఉంటుందన్నారు. జీపీఎస్ ఆధారిత పారిశుద్ధ్య పర్యవేక్షణ ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


ప్రతి వాహనాన్ని పర్యవేక్షిస్తాం: సీపీ రాజశేఖర్ బాబు

ఈసారి కొండచరియల వల్ల ఘాట్‌రోడ్డు మూసుకుపోతే మహామండపంలో ఐదు అంతస్తుల నుంచి క్యూలైన్లు వదులుతామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఇది ప్రయోగాత్మకంగా చేసే పనిగా చెప్పుకొచ్చారు. ప్రతి వాహనం ఎన్నిసార్లు కొండమీదకు వచ్చిందనేది పర్యవేక్షణ ఉంటుందన్నారు. గతం కంటే తక్కువ మంది పోలీసులుంటారని సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

వివేకా హత్య కేసులో ఈడీ విచారణ.. ఎర్ర గంగిరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 01:52 PM