Share News

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.! క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:06 PM

కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విలీనం కానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు.

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.! క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
KC Venugopal

ఢిల్లీ, జూన్11, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విలీనం కానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) స్పందించారు. టీఎంసీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనే ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, అవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ కార్యాచరణను స్వతంత్రంగా కొనసాగిస్తోందని, టీఎంసీ కూడా తన పార్టీ విధానాల ప్రకారమే ముందుకు సాగుతోందని తెలిపారు. ఈరోజు (గురువారం) ఢిల్లీ ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మీడియాతో కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.


దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల పొత్తులు వంటి అంశాలు వేరని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. పార్టీల విలీనం గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఎంసీ పార్టీల మధ్య విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగట్లేదని, అలాంటి ప్రతిపాదనలు కూడా లేవని కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం కానుందన్న ప్రచారానికి తెరపడినట్లైంది.


ఈ వార్తలు కూడా చదవండి...

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 04:37 PM