Share News

సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై హెడ్ కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి

ABN , Publish Date - Sep 29 , 2026 | 08:29 PM

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బందిలో ఒకరు తన సహచరులపై కాల్పులు జరిపారు.

సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై హెడ్ కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి
cisf firing

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అబ్దేష్ కుమార్‌ తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. ఓ వాగ్వాదం ఈ ఘటనకు దారితీసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. అలాగే ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ కూడా విచారణ చేపట్టింది.


కథువాలోని సేవా 2 హైడల్ ప్రాజెక్ట్‌ వద్ద సీఐఎస్ఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అబ్దేష్ కుమార్‌కు సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అతడు ఏకే-47తో కాల్పులు జరపడం ప్రారంభించాడు. మృతి చెందినవారిలో అసిస్టెంట్ కమాండ్ లెవల్ ఆఫీసర్ అంకిత్ కుమార్ పాండే కూడా ఉన్నారు. అలాగే ఎస్ఐ లక్ష్మన్ సింగ్, సీటీ సంజయ్ కుమార్, సీటీ మహమ్మద్ రఫీ కాల్పుల్లో మరణించారు.

Updated Date - Sep 29 , 2026 | 09:10 PM