Share News

పాక్ బార్డర్ హైవేని హెలిప్యాడ్‌గా మార్చిన భారత ఆర్మీ!

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:49 PM

భారత ఆర్మీ స్థానిక జాతీయ రహదారిని తాత్కాలిక హెలిప్యాడ్‌గా ఉపయోగించి ఒక వినూత్న విన్యాసాన్ని చేపట్టింది. రాజస్థాన్‌లోని పాక్ సరిహద్దు సమీపంలో ఉన్న నేషనల్ హైవేలో కొంత భాగాన్ని ల్యాండింగ్, టేకాఫ్‌ల కోసం వినియోగించారు.

పాక్ బార్డర్ హైవేని హెలిప్యాడ్‌గా మార్చిన భారత ఆర్మీ!
Highway Turns Helipad as Army Helicopters Land Near Pak Border

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 29: భారత ఆర్మీ స్థానిక జాతీయ రహదారిని తాత్కాలిక హెలిప్యాడ్‌గా ఉపయోగించి ఒక వినూత్న విన్యాసాన్ని చేపట్టింది. ఇవాళ (మంగళవారం) రాజస్థాన్‌లోని పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న దంతౌర్ వద్ద నేషనల్ హైవే 911 (NH 911) లో కొంత భాగాన్ని హెలికాప్టర్ల ల్యాండింగ్, టేకాఫ్‌ల కోసం వినియోగించారు.


దశాబ్దపు సర్జికల్ స్ట్రైక్స్ వార్షికోత్సవం

2016 సెప్టెంబర్ 28–29 రాత్రి ఉరి ఉగ్రదాడికి సమాధానంగా భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) దాటి చేసిన చారిత్రాత్మక 'సర్జికల్ స్ట్రైక్స్'కు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ విన్యాసం జరగడం గమనార్హం. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ద్రువ్ (Dhruv), దాని సాయుధ రకం రుద్ర (Rudra) చేతక్ (Chetak) హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.


సాధారణ ఎయిర్‌ఫీల్డ్ లేదా హెలిప్యాడ్‌లు అందుబాటులో లేనప్పుడు, ప్రత్యామ్నాయంగా రోడ్లను ఉపయోగించి దళాల మోహరింపు, సహాయక చర్యలు ఎలా చేపట్టవచ్చో ఈ డ్రిల్ ద్వారా పరీక్షించారు. రాజస్థాన్ పశ్చిమ ఎడారి ప్రాంతమైన దంతౌర్‌లో ఎయిర్‌ఫీల్డ్‌ల సంఖ్య తక్కువగా ఉండటం, విస్తృతమైన విస్తీర్ణం కలిగి ఉండటం వల్ల సరిహద్దు రక్షణ దృష్ట్యా ఈ ప్రాంతం అత్యంత కీలకమైనదిగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

Updated Date - Sep 29 , 2026 | 06:14 PM