మచ్చార్‌కు శౌర్య పురస్కారం అందించనున్న ఇజ్రాయెల్
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:29 AM
ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ ఉగ్రదాడి నుంచి 174 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. త్వరలో మచ్చార్‌కు తమ దేశ అత్యున్నత అవార్డు అందిస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాగ్ హెర్జాగ్ తెలిపారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ ఉగ్రదాడి ఘటనలో 174 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. త్వరలో మచ్చార్‌కు తమ దేశ అత్యున్నత అవార్డు అందిస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాగ్ హెర్జాగ్ తెలిపారు. ఫ్లైదుబాయ్ విమానంలో గత నెల 30న మచ్చార్‌పై ఒమనీ కోపైలట్ హమ్మామ్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తాను తీవ్రంగా గాయపడినా.. కోపైలట్‌ను మచ్చార్ ప్రతిఘటించారు. తర్వాత కాక్‌పిట్ తలుపులు తెరవడంతో విమానంలోని ప్రయాణికులు వచ్చి హమ్మామీని పట్టుకున్నారు. అతడిని పట్టుకుని నిలువరించిన ఐదుగురు ప్రయాణికులను జెరుసలెంలో అధ్యక్షుడు హెర్జాగ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచ్చార్ చూపిన తెగువ, ధైర్యసాహసాల వల్లే పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అబుధాబిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మచ్చార్ కోలుకోగానే ఆయనకు అవార్డు అందిస్తామన్నారు.
మచ్చార్‌ను తానే స్వయంగా కలిసి ఆ పురస్కారాన్ని అందిస్తానని వెల్లడించారు. ‘‘భారతీయ పైలట్, కెప్టెన్ మచ్చార్‌తో పాటు మా దేశ పౌరులు కూడా ఆ కోపైలట్‌పై పోరాడారు. మా హీరోలను అభినందించడంతో పాటు మచ్చార్‌కూ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. మచ్చార్ ధైర్యం, సాహసం, ప్రొఫెషనలిజం వల్ల భారీ ప్రమాదం తప్పింది. మచ్చార్ కోలుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజల తరపున నేనే ఆయనను కలుస్తా. ఆయనకు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని అందిస్తా’’ అని హెర్జాగ్ పేర్కొన్నారు. కాగా.. అబుధాబిలోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చార్ ప్రస్తుతం కోలుకుంటున్నారని డాక్టర్లు ప్రకటించారు. చికిత్సకు బాగా స్పందిస్తున్నారని తెలిపారు. మచ్చార్, ఆయన కుటుంబ సభ్యులతో భారతీయ దౌత్య అధికారులు, స్థానిక అధికారులు ఎప్పటికపుడు మాట్లాడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మస్క్‌కు యూఎస్ సైన్స్ మెడల్ ప్రదానం.. ట్రంప్ కితాబు
దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్ కత్తి
Read Latest National and International news