షార్జాలో దారుణం! భారతీయుడిని చంపి.. మృతదేహాన్ని 9 ముక్కలుగా చేసి..
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:01 AM
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోని షార్జాలో దారుణ హత్యకు గురయ్యారు. జూలైలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోని షార్జాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో కర్ణాటకకు చెందిన ఆల్విన్ ప్రకాశ్ కుందర్ (44) అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. తన సోదరుడిని దారుణంగా చంపి, మృతదేహాన్ని 9 ముక్కలుగా చేశారని ఆల్విన్ ప్రకాశ్ సోదరుడు అనిల్ ప్రశాంత్ మంగళవారం వెల్లడించారు. అలాగే ఆల్విన్ ప్రకాశ్ హత్య తరువాత ఆయన భార్య, కుమారుడు తప్పిపోయారని లుస్తోంది.
ఆల్విన్ ప్రకాశ్ కుందర్ గత 14 సంవత్సరాలుగా షార్జాలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్నారు. ఆయన భార్య టీనా అక్కడే స్కూల్‌టీచర్‌గా పని చేస్తున్నారు. ఈ దంపతుల కుమారుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. కాగా జూలై 20న తన సోదరుడికి అనిల్ ప్రశాంత్ కాల్ చేశారు. కానీ ఆల్విన్ ఆ కాల్‌ను ఎత్తకుండా.. తాను బాగానే ఉన్నానని మెసేజ్ పెట్టారు. తన సోదరుడి నుంచి ఎప్పుడూ ఇలాంటి మెసేజ్‌లు అనిల్‌కు రాలేదు. వారం తరువాత మళ్లీ కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానంతో అనిల్ షార్జాలోనే ఉండే తన స్నేహితుడికి కాల్ చేసి విషయం చెప్పారు. ఆ స్నేహితుడు ఆల్విన్ ప్రకాశ్ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా.. ఫ్లాట్ ఖాళీగా ఉంది. వాచ్‌మన్‌ను ఆరా తీయగా ఆల్విన్ ప్రకాశ్ భారత్‌కు వెళ్లిపోయారని తెలిసింది.
దీంతో అనిల్‌కు అనుమానం ఎక్కువైంది. వెంటనే ఆల్విన్ పనిచేస్తున్న కంపెనీని ఆయన సంప్రదించారు. పాస్‌పోర్ట్ రికార్డు పరిశీలించిన ఆ కంపెనీ ఆల్విన్ భారత్‌కు వెళ్లలేదని నిర్ధారించింది. ఆ తరువాత అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో 9 ముక్కలుగా కట్ చేసిన ఆల్విన్ మృతదేహం ఓ కారులో లభ్యమైంది. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆల్విన్ భార్య, కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..
ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది..?