ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ప్రజలకు భారీ ఊరట!
ABN , Publish Date - Mar 09 , 2026 | 10:14 AM
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినా దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్ర స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 9: దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూతపడిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఇంధన ధరలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కూడ్రాయిల్ ధరలు పెరిగినా.. దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నష్టాలను ఆయిల్ కంపెనీలు భరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. సామాన్య ప్రజలకు, వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది.
ప్రస్తుతం.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటుతున్న నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలపై భారం పడకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. నష్టాలను తాత్కాలికంగా భరించాలని కేంద్రం ఆదేశించింది. దేశంలో ఇప్పటికే ముడి చమురు నిల్వలు 25 రోజులకు, రిఫైన్డ్ ఇంధనాలు మరో 25 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది. మొత్తంగా 8 వారాల ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయంది. ఇక.. రష్యా, ఇతర దేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్న నేథ్యంలో సరఫరా స్థిరంగా ఉంది.
ప్రస్తుత ధరలు:
న్యూఢిల్లీలో పెట్రోల్: రూ.94.72/లీటర్, డీజిల్: రూ.87.62/లీటర్
ముంబైలో పెట్రోల్: రూ.103.54/లీటర్, డీజిల్: రూ.90.03/లీటర్
హైదరాబాద్‌లో పెట్రోల్: రూ.107.46/లీటర్, డీజిల్: రూ.95.70/లీటర్
ఇవి కూడా చదవండి..
తిరుపతి జిల్లాలో విషాదం.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి
Read Latest National News And Telugu News