తిరుపతి జిల్లాలో విషాదం.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి
ABN , Publish Date - Mar 09 , 2026 | 09:53 AM
తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు అడవికి సమీపంలోని సాయిబులపల్లె పొలాల్లో వేటగాళ్లు వేసిన కరెంట్ ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి చెందాయి.
తిరుపతి: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎర్రావారి పాలెం మండలంలోని నెరబైలు అడవికి సమీపంలో వేటగాళ్లు వేసిన కరెంట్ ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, ఎర్రావారి పాలెం మండలం నెరబైలు అడవికి సమీపంలోని సాయిబులపల్లె ప్రాంతంలో వేటగాళ్లు అక్రమంగా కరెంట్ ఉచ్చులు వేశారు. అడవిలో నుంచి మేత కోసం పొలాల వైపు వచ్చిన రెండు గజరాజులు ఆ కరెంట్ ఉచ్చులో చిక్కి తీవ్ర షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వేటగాళ్లు ఉద్దేశపూర్వకంగా కరెంట్ ఉచ్చు పెట్టడం వల్లనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వేటగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
Also Read:
ప్రీమియం బారెడు క్లెయిమ్ మూరెడు!
నేనక్కడే ఉన్నా.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు..!
For More Latest News