Share News

నేనక్కడే ఉన్నా.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు..!

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:29 AM

నేను 2006లో జడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి నాకంటే తక్కువ పదవిలోనే ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అందుకుంటూ..

నేనక్కడే  ఉన్నా.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు..!

  • మహిళా దినోత్సవంలో పట్నం సునీతారెడ్డి వ్యాఖ్య

కేపీహెచ్‌బీకాలనీ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను 2006లో జడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి నాకంటే తక్కువ పదవిలోనే ఉండేవారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అందుకుంటూ.. తాజాగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, నేను మాత్రం ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే(జడ్పీ చైర్మన్‌ స్థాయిలోనే) ఆగిపోయాను’’ అని కాంగ్రెస్‌ నాయకురాలు పట్నం సునీతా రెడ్డి పేర్కొన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో ఆదివారం కాంగ్రెస్‌ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చకు దారితీశాయి. గత ఎన్నికల్లో తనకు పట్టున్న చేవెళ్ల ఎంపీ టికెట్‌ అడిగితే కాదని.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయించారని, దానివల్లే తాను ఓడిపోయానని సునీతా రెడ్డి ఆరోపించారు.

Updated Date - Mar 09 , 2026 | 04:29 AM