ఆస్పత్రుల్లో ఏఐ సేవలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:48 AM
కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఆస్పత్రుల్లో ఏఐ సేవలుపైలట్‌గా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగం: మంత్రి సత్యకుమార్
అమరావతి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఎంపి క చేసిన 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 మంది ఇన్నోవేటర్లు ఏకకాలంలో 40 పరికరాల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్ర్కీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారన్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే వ్యాధి నిర్ధారణ అవుతుందని, దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులకు సమయం ఆదా అవుతుందని చెప్పారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లో, సిద్థార్థ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, తెనాలిలోని జిల్లా ఆస్పత్రి, ఇతర చోట్ల పైలట్ ప్రాజెక్టు విధానంలో వివిధ రకాల పరీక్ష లు చేస్తున్నామని చెప్పారు. రోగులు, వైద్యుల మధ్య జరిగే సంభాషణను రికార్డింగ్ చేయడం, దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, గుండెజబ్బులు, రక్తహీనతను గుర్తించడం, సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో ఏఐ కెమెరా వినియోగం, చిన్నపిల్లల్లో న్యూరాలజికల్ డిజార్టర్స్, క్యాటరాక్ట్, గ్లొకోమా, రక్తహీనత, ఇతర పరీక్షలకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తారని తెలిపా రు. ఇటీవల ఆస్పత్రుల్లో పైలట్ విధానంలో ప్రారంభమైన వీటి ఫలితాలపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందిస్తామని మంత్రి తెలిపారు.