నెయ్యి ట్యాంకర్ బోల్తా
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:49 AM
తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాం కర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ట్యాంకర్ నుంచి కారిపోతున్న నెయ్యి కోసం జనం బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు.
తిరుమలకు నెయ్యి తెస్తుండగా ఘటన
బిందెలు, బకెట్లతో ఎగబడిన జనం
కొండాపురం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాం కర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ట్యాంకర్ నుంచి కారిపోతున్న నెయ్యి కోసం జనం బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. కడప జిల్లా కొండాపురం మం డలం పెంజిఅనంతపురం గ్రామం వద్ద జాతీయ రహదారి-67పై ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణె నుంచి 21 వేల లీటర్ల నెయ్యిని తిరుమలకు తీసుకొస్తున్న ట్యాంకర్ పెంజిఅనంతపురం వద్ద మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి నెయ్యి కారిపోతుండటంతో స్థానికులు బిందెలు, బకెట్లు, క్యాన్లలో నింపుకొని తీసుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టామని కొండాపురం ఎస్‌ఐ జయరాములు తెలిపారు.