విమాన టికెట్ ధరలకు కళ్లెం.. కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టుకు కేంద్రం కీలక సమాచారం
ABN , Publish Date - Oct 16 , 2026 | 08:44 PM
విమాన టికెట్ ధరల నిబంధనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫ్లైట్ టికెట్ ధరలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నూతన నిబంధనల విషయం కొలిక్కి వచ్చిందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ నేపథ్యంలో..
ఇంటర్నెట్ డెస్క్: విమాన టికెట్ ధరల నిబంధనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫ్లైట్ ధరలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నూతన నిబంధనల విషయం కొలిక్కి వచ్చిందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఆ నిబంధనలకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా లభించాయని పేర్కొంది. వచ్చే రెండు వారాల్లో వాటిని నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ను మరోసారి విచారించిన సుప్రీంకోర్టు.. వచ్చే నెల 16న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. అప్పటిలోగా విమానాల టికెట్ ధరలకు సంబంధించిన కొత్త రూల్స్ను తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
డిమాండ్ ఉన్న సమయాల్లో ఎయిర్లైన్స్ టికెట్ ధరలను భారీగా పెంచుతుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఇష్టానుసారంగా పెంచడంతో విమాన ప్రయాణం ఖరీదుగా మారుతోందని, వీటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఫ్లైట్ ఛార్జీల నిర్ణయంపై మరింత నిశిత పరిశీలన జరగాలని, పరిష్కార చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కొంతకాలంగా ఈ పిటిషన్పై విచారణ జరుపుతోన్న సుప్రీంకోర్టు.. నిబంధనలు పాటించని విమాయాన సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. అయితే భారతీయ వాయుయాన్ అధినియం- 2024 చట్టం కింద కొత్త నిబంధనలు రూపొందించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ముసాయిదాను సర్వోన్నత న్యాయస్థానంకి ఇటీవలే అందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు