Share News

ఢిల్లీలో సీజేపీ నేతల అరెస్టుతో ఉద్రిక్తత.. కన్నాట్ ప్లేస్‌లో జాతీయ జెండా ఎగురవేతకు పిలుపు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:17 PM

ఢిల్లీలో సీజేపీ నేతల ముందస్తు నిర్బంధం దుమారం రేపింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సహా పలువురు నేతల అరెస్టుకు నిరసనగా సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండా ఎగురవేయాలని పార్టీ వర్గాలు పిలుపునివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీలో సీజేపీ నేతల అరెస్టుతో ఉద్రిక్తత.. కన్నాట్ ప్లేస్‌లో జాతీయ జెండా ఎగురవేతకు పిలుపు
CJP Protest Delhi

CJP Leaders Arrested Delhi: ఆందోళనలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, పార్టీ ఇతర నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఢిల్లీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం దుమారం రేపింది. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించిన సీజేపీ వర్గాలు, నేతల నిర్బంధానికి నిరసనగా కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ (Central Park, Connaught Place) వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు సెంట్రల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.


ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తీరుకు వ్యతిరేకంగా, అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన లోపాలను ఆరోపిస్తూ సీజేపీ తలపెట్టిన ఆందోళనలు ఢిల్లీలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 05:43 PM