Share News

కోల్‌కతాలో రహస్యంగా ఆయుధాల తయారీ.. ఎస్‌టీఎఫ్ తనిఖీలో వెలుగులోకి..

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:39 PM

కోల్‌కతాలోని అయూబ్‌నగర్‌లో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దాడుల్లో 7 ఎంఎం తుపాకులు -2, దేశీయ తుపాకులు -2, వివిధ రకాల తూటాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉండగా, అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

కోల్‌కతాలో రహస్యంగా ఆయుధాల తయారీ.. ఎస్‌టీఎఫ్ తనిఖీలో వెలుగులోకి..
Kolkata Illegal Arms

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కోల్‌కతాలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రం బయటపడింది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (STF) దాడుల్లో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తుపాకులు, తూటాలు, ఆయుధాల తయారీ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నాడియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయూబ్‌నగర్‌లో పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ఈ అక్రమ ఆయుధాల తయారీ యూనిట్‌ గుట్టు రట్టు చేశారు.


ఘటనా స్థలం నుంచి 7-MM తుపాకులు-2, దేశీయంగా తయారు చేసిన తుపాకులు-2, వివిధ కాలిబర్‌ల తూటాలు, పేలిన తూటాలు , భారీగా ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులను ముందే పసిగట్టి నిందితులు పరారయ్యారు. నాడియల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్రమ ఆయుధాల నెట్‌వర్క్ వెనుక ఎవరెవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం

హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్‌విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:15 PM