Share News

సొంత పౌరులపైనే మోదీ యుద్ధం చేయాలనుకుంటున్నారా !?: అభిజిత్ దీప్కే

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:17 AM

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ శనివారం దేశ రాజధాని ఢిల్లోలో సీజేపీ ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా స్పందించారు.

 సొంత పౌరులపైనే మోదీ యుద్ధం చేయాలనుకుంటున్నారా !?: అభిజిత్ దీప్కే
cjp abhijeeth deepke on modi

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ఢిల్లోలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో నిరసనలకు ప్రభుత్వ అనుమతి లేదని పేర్కొంటూ.. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఢిల్లీకి వచ్చే అన్ని బార్డర్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దానితోపాటు జంతర్ మంతర్, పార్లమెంట్, ఇండియా గేట్, పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పటికే ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. అంతేకాకుండా.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ 57 మెట్రో స్టేషన్లను మూసివేసింది.


సొంత పౌరులపైనే యుద్ధం చేస్తారా: అభిజిత్ దీప్కే

ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ‘ప్రధాని మోదీ దేశ యువతకు ఎందుకంత భయపడుతున్నారో అర్థం కావడం లేదు. బహుశా దేశ ప్రజలు ఇకపై ఆయనకు ఓటు వేయరని తెలిసినట్టు ఉంది. అందుకే ఈ నిరసనలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. లేకపోతే.. అన్ని రైల్వే సేవలను నిలిపివేయాల్సిన అవసరం ఏమిటి? అన్ని మెట్రో కార్యకలాపాలను ఆపివేయాల్సిన అవసరం ఏమిటి? ఇంటర్నెట్‌ను కట్ చేసి, రోడ్లను దిగ్బంధించారు. జమ్మూ‌కాశ్మీర్ నుంచి సైన్యాన్ని తీసుకువచ్చి ఢిల్లీలో మోహరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల నుండి సీఆర్పీఎఫ్ బలగాలను పిలిపించి ఢిల్లీలో పెట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షా తమ సొంత దేశ ప్రజలపై యుద్ధం చేయాలనుకుంటున్నారా? తమ సొంత పౌరులపై పోలీసు, సైనిక బలగాలను ప్రయోగిస్తారా? జ్ఞానేష్ కుమార్ వారికి అంత ప్రియమైనవారా.. ? ఈ ప్రశ్నలకు మోదీయే సమాధానం చెప్పాలంటూ అభిజిత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు

జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2026 | 09:59 AM