Share News

18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి తోసేసిన బాలిక

ABN , Publish Date - Oct 15 , 2026 | 09:59 PM

ఓ బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి 18 నెలల చిన్నారిని పదేళ్ల బాలిక కిందకు విసిరేయడంతో ఆ చిన్నారి చనిపోయింది. ముంబైలోని గోరేగావ్‌లో ఈనెల 14న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.

18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి తోసేసిన బాలిక

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి 18 నెలల చిన్నారిని పదేళ్ల బాలిక కిందకు విసిరేయడంతో ఆ చిన్నారి చనిపోయింది. ముంబైలోని గోరేగావ్‌లో ఈనెల 14న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. ఆ భవనంలోని అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. పదేళ్ల బాలిక ఆ చిన్నారిని ఆరో అంతస్తు నుంచి కిందకు విసిరేసి అక్కడి నుంచి పరుగెత్తినట్లు కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాగా.. చిన్నారి కుటుంబం ఈనెల 1నే ఆ భవనంలోకి మారారని అధికారులు తెలిపారు. ఒక పిల్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య గతంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆ వివాదం ఏమిటో తెలియలేదు.


కాగా.. చిన్నారిని పడేసిన బాలిక మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. చిన్నారి మ‌ృతిపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఘటనను దాచిపెట్టేందుకు బాలిక కుటుంబ సభ్యులు సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారని వారు ఆరోపించారు. మరోవైపు పోలీసులు ఆ బాలికతో పాటు ఆమె తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిని విచారిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై యాక్సిడెంటల్ డెత్ రిపోర్టుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Updated Date - Oct 15 , 2026 | 10:04 PM