సిక్కుల ఊచకోతపై క్షమాపణ చెప్పరా?.. సోనియా ఆత్మకథపై హర్సిమ్రత్ విమర్శ
ABN , Publish Date - Nov 11 , 2026 | 08:30 PM
కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శిరోమణి అకాలీ దళ్ నేత, ఎంపీ హర్సిమ్రత్ బాదల్ ఆ పుస్తకంపై పలు విమర్శలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శిరోమణి అకాలీ దళ్ నేత, ఎంపీ హర్సిమ్రత్ బాదల్ ఆ పుస్తకంపై పలు విమర్శలు చేశారు. సిక్కుల ఊచకోతను చిన్న విషయంగా పేర్కొన్నారని, ఆ దారుణ ఘటన జరిగి 40 ఏళ్లయినా సోనియా గాంధీ ఇప్పటి వరకూ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని ఆమె ‘ఎక్స్’లో మండిపడ్డారు. 1984లో జరిగిన ఆ దారుణ ఊచకోతను పంజాబ్ మరువదని, దోషులను క్షమించదని పేర్కొన్నారు.
కాగా.. 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత పంజాబ్‌లో సిక్కుత ఊచకోత జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనను సోనియా తన ఆత్మకథలో ప్రస్తావించారు. అదొక విషాదకరమైన, సిగ్గుమాలిన అధ్యాయంగా సోనియా అభివర్ణించారు. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా సిక్కులకు తగిన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఆ హింసాత్మక ఘటనల్లో కాంగ్రెస్ కార్యకర్తల హస్తం ఉందని ఆమె ఒప్పుకున్నారు. ఇందిర హత్య తర్వాత చాలా మంది కోపోద్రిక్తులయ్యారని, తర్వాత పంజాబ్‌లో చాలా మంది సిక్కులను చంపారని చెప్పారు. ఒక్క రాజధానిలోనే 2 వేల మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తర్వాత రాజీవ్ గాంధీ టీవీలో ఒక ప్రకటన చేశారని, అందరూ శాంతి సంయమనాన్ని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. సిక్కులపై రాజీవ్‌కు ఎలాంటి ద్వేషం, దురభిమానం లేదని సోనియా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...