వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
ABN , Publish Date - Nov 11 , 2026 | 07:46 PM
వివాహేతర సంబంధం కొనసాగించవద్దన్నందుకు కన్న కొడుకునే చంపిందో తల్లి. తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి కుమారుడిని గొంతునులిమి చంపేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వివాహేతర సంబంధం కొనసాగించవద్దన్నందుకు కన్న కొడుకునే చంపిందో తల్లి. తన ప్రియుడు, ఆ ప్రియుడి స్నేహితులతో కలిసి కుమారుడిని గొంతునులిమి చంపేసింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈనెల 1న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని విజయ్ నారాయణ్‌గా గుర్తించారు. బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌లో అతను నివసించేవాడు. విజయ్ తల్లి మీనా నారాయణ్ ఒక బ్యూటీ పార్లర్‌లో మేనేజర్‌గా పనిచేసేది. మహారాష్ట్రకు చెందిన రాకేష్ జామునిని ఆమె తన డ్రైవర్‌గా నియమించుకుంది. ఈ క్రమంలో రాకేష్‌తో మీనా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కుమారుడు విజయ్‌కు తెలియడంతో అతను వారించాడు. ఆ సంబంధం కొనసాగించవద్దని తల్లిని పలుమార్లు కోరాడు. అయినా.. ఆమెలో మార్పు రాలేదు.
తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును చంపాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు రాకేష్‌తో కలిసి కుట్రపన్నింది. కాగా.. ఈనెల 1న బెళగావిలో కర్ణాటక రాజ్యోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలను చూసేందుకు వెళదామని విజయ్‌ను బెళగావికి తీసుకెళ్లింది. అక్కడ ఒక శీతల పానీయంలో మత్తుమందు కలిపి విజయ్‌కు ఇచ్చింది. ఆ డ్రింక్ తాగాక అతను స్పృహ కోల్పోయాడు. తర్వాత విజయ్‌ను రాకేష్, అతని స్నేహితులు, విజయ్ తల్లి ఒక టవల్‌తో గొంతునులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ హైవే పక్కన పడేసి వెళ్లిపోయారు. మృతుడి ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. ఈ ఘటనలో మీనా, రాకేష్, రాకేష్ స్నేహితులు నలుగురిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...