Share News

శ్రీలంక గైడ్‌ను సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ పర్యాటకుడు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:37 PM

సముద్రంలో వెళ్తున్న ఓ పడవపై నుంచి శ్రీలంక గైడ్‌ను ఇజ్రాయెల్ పర్యాటకుడు సముద్రంలోకి తోసేశాడు. శ్రీలంకలో ఏ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందో తెలియాల్సి ఉంది.

శ్రీలంక గైడ్‌ను సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ పర్యాటకుడు

ఇంటర్నెట్ డెస్క్: సముద్రంలో వెళ్తున్న ఓ పడవపై నుంచి శ్రీలంక గైడ్‌ను ఇజ్రాయెల్ పర్యాటకుడు సముద్రంలోకి తోసేశాడు. శ్రీలంకలో ఏ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందో తెలియాల్సి ఉంది. ఓ పడవలో ఇజ్రాయెల్ పర్యాటకులతో పాటు శ్రీలంక మహిళా గైడ్‌ కూడా వెళుతున్నారు. ఆ గైడ్ నీరు తాగుతుండగా ఆమె పక్కన కూర్చున్న ఇజ్రాయెల్ టూరిస్టు ఒక్కసారిగా ఆమెను సముద్రంలోకి తోసేశాడు. ఆమెకు సాయం చేయాల్సిన ఇతర పర్యాటకులు పడవలోనే ఉండి నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. దీంతో నెటిజన్లు ఆ ఇజ్రాయెల్ పర్యాటకుడి తీరుపై దుమ్మెత్తి పోశారు.


స్థానిక గైడ్‌లకు కనీస మర్యాద ఇవ్వాలన్న జ్ఞానం కూడా ఆ పర్యాటకులకు లేకుండా పోయిందని పలువురు నెటిజన్లు విమర్శించారు. ఒక లేడీ గైడ్‌ను సముద్రంలోకి తోసేసి సాయం చేయకుండా జోకులు వేస్తూ గడపడం ఏమిటని ప్రశ్నించారు. ఆ టూరిస్టులను అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియరాలేదు. తనను టూరిస్టు సముద్రంలోకి తోసిన తర్వాత ఆ మహిళా గైడ్ ఈదుతూ కనిపించారు. తర్వాత ఆమెకు ఏమైందో తెలియరాలేదు. ఆమెకు ఆ ఇజ్రాయెల్ పర్యాటకుడు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Updated Date - Nov 11 , 2026 | 05:37 PM