అలిస్‌తో వివాహేతర బంధానికి మూల్యం రూ.70వేల కోట్లు
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:18 AM
చైనా మహిళ అలిస్‌తో వివాహేతర సంబంధం, ఆమె చైనా కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా సీఈవో జెన్సస్ హువాంగ్ సంపద ఒక్కరోజులోనే ఏకంగా రూ.70వేల కోట్లు తరిగిపోయింది
ఒక్క రోజులోనే కోల్పోయిన ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్
ఎన్విడియాను దాటేసి ప్రపంచలోనే రెండో అత్యంత విలువైన సంస్థగా మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ, నవంబరు 10: చైనా మహిళ అలిస్‌తో వివాహేతర సంబంధం, ఆమె చైనా కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా సీఈవో జెన్సస్ హువాంగ్ సంపద ఒక్కరోజులోనే ఏకంగా రూ.70వేల కోట్లు తరిగిపోయింది. సోమవారం అమెరికాలో ట్రేడింగ్ ప్రారంభమైన తొలి 30నిమిషాల్లోనే ఎన్విడియా షేర్లు 7.4బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయాయి. దీంతో, జెన్సన్ నికర ఆస్తి విలువ 154బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న ఆయన 10వ స్థానానికి పడిపోయారు. అలాగే, మంగళవారం మార్కెట్‌లో ఎన్విడియా షేర్ విలువ 6 శాతం మేర పతనమైంది. ఎన్విడియా కంపెనీ మార్కెట్ విలువ పడిపోయింది. దీంతో ఎన్విడియాను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన సంస్థ మైక్రోసాఫ్ట్ నిలిచింది. ఇదిలా ఉండగా, జెన్సన్‌పై గూఢచర్యం సముద్రంలో నీటిబిందువు లాంటిదని అమెరికా టెక్ సంస్థలపై చైనా ముప్పును అంచనా వేసే ‘స్ట్రాటజీ రిస్క్స్’ సంస్థ సీఈవో ఐజాక్ స్టోన్‌ఫిష్ అన్నారు. చైనా గూఢచర్య నెట్‌వర్క్ అమెరికాలో మరింత లోతుగా, బలంగా విస్తరించి ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలోని ఎన్నో కంపెనీలు, ముఖ్యంగా ఫార్చూన్ 500 జాబితాలో ఉన్న కంపెనీల సీఈవోలు, ఉన్నతస్థాయుల్లో ఉన్నవారిపై ఇప్పటికే చైనా గూఢచర్యం చేస్తుందేమోనన్నారు.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!
దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..