Share News

దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:58 PM

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగిస్తున్నాయి. అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగిస్తున్నాయి. అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉందని చెబుతూ.. తమ బలగాలు 'లాక్డ్ అండ్ లోడెడ్' స్థితిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు (Donald Trump warning).


ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి అనుమతించబోమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ విషయంలో అవసరమైతే పూర్తి చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెప్పారు. సైనిక సామగ్రి, ఆయుధాల తయారీని కూడా అమెరికా పెంచుతోందని వెల్లడించారు. దాడికి తమ సైన్యం పూర్తి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు (Iran Nuclear Weapons).


అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కూడా గట్టిగానే స్పందిస్తోంది. అమెరికా మరోసారి దాడులకు దిగితే తమ సైన్యం వెంటనే ప్రతీకారం తీర్చుకుంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి మహమ్మద్ అక్రమినియా హెచ్చరించారు (US Iran Tensions). అమెరికా, ఇజ్రాయెల్‌తో గతంలో జరిగిన ప్రత్యక్ష ఘర్షణల నుంచి తమ సైన్యం అనుభవం సంపాదించిందని, ప్రస్తుతం మరింత అప్రమత్తంగా ఉందని తెలిపారు. అమెరికా దాడులకు భౌగోళిక పరిమితులు లేకుండా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..


స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 10 , 2026 | 12:58 PM