కొడైకెనాల్ పర్యాటక ప్రాంతాలకు ఉచిత ప్రవేశం
ABN , Publish Date - May 26 , 2026 | 11:29 AM
తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చని జిల్లా యంత్రాంగం తెలిపింది.
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చని జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌కు పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా, వేసవిలో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటోంది. వేసవి లో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉద్యానవన, వ్యవసాయ శాఖలు ప్రత్యేకంగా పూలు, పండ్ల ప్రదర్శనలు ఏర్పాటుచేస్తుంటారు.
ఈ క్రమంలో, ప్రస్తుతం పర్యాటకులు క్యూఆర్ విధానంలో టిక్కెట్లు కొనుగోలులో జాప్యం ఏర్పడడంతో, కొడైకెనాల్ రోడ్లపై పర్యాటకుల వాహనాలు బారులుతీరుతున్నాయి. ఈ విషయమై దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం, కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రాంతాలైన పిల్లర్ రాక్స్, గుణ గుహలు, పైన్ ఫారెస్ట్, మోయర్ పాయింట్ తదితరాలను సోమవారం నుంచి ఈ నెల 31వ తేది వరకు ఉచితంగా సందర్శించవచ్చని ప్రకటన విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..
సామాన్యుడిపై మరో భారం.. కిలోకు రూ.2 పెరిగిన సీఎన్‌జీ ధర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News