తమిళనాడులో ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో కార్మికుల మృతి
ABN , Publish Date - Jul 11 , 2026 | 07:35 PM
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లా మామల్లపురంలో బోర్‌వెల్ తవ్వకాల సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్, జులై 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లా మామల్లపురంలో బోర్‌వెల్ తవ్వకాల సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈరోజు (శనివారం) మామల్లపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ఎదురుగా బోర్‌వెల్ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో డ్రిల్లింగ్ యంత్రం సమీపంలోని విద్యుత్ లైన్‌కు తాకినట్లు సమాచారం.
విద్యుత్ తీగలకు డ్రిల్లింగ్ యంత్రం తగలడంతో ఒక్కసారిగా కరెంట్ ప్రవహించింది. అక్కడే పనిచేస్తున్న నలుగురు కార్మికులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి, అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News