ఢిల్లీలో అగ్నిప్రమాదం... ముగ్గురి మృతి
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:53 PM
ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీకేదత్ కాలనీలోని ఓ నివాస గృహంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.
ఢిల్లీ, జులై 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీకేదత్ కాలనీలోని ఓ నివాస గృహంలో ఈరోజు(మంగళవారం) అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే అప్పటికే ఇంట్లో చిక్కుకున్న మహిళ, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ కారణమా.? లేదా ఇతర కారణాలున్నాయా.? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో మరెవరైనా ఉన్నారా.? అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దుర్ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. ఎమ్మెల్యేల అలర్ట్
పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News