ఢిల్లీలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు.. హాజరైన పయ్యావుల, భట్టి
ABN , Publish Date - Sep 19 , 2026 | 10:46 AM
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వికసిత్ భారత్ దిశగా దేశానికి ఆర్థిక వనరులపై చర్చించనున్నారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 19: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వికసిత్ భారత్ దిశగా దేశానికి ఆర్థిక వనరులపై చర్చించనున్నారు. కేంద్ర - రాష్ట్రాల విధాన సమన్వయంపై ప్రధానంగా చర్చ జరుగనుంది. వికసిత్ భారత్ లక్ష్యానికి ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యంపై, మైక్రో ఎకనామిక్ పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగ పరివర్తనకు ఆర్థిక వనరులపై సదస్సుల్లో చర్చిస్తారు. ఎనర్జీ ట్రాన్సిషన్‌కు నిధుల సమీకరణపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
Read Latest National News And Telugu News