Share News

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి

ABN , Publish Date - May 18 , 2026 | 06:03 PM

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికిపైగా మృతిచెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారు.

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి
Maharashtra Road Accident

ఇంటర్నెట్ డెస్క్, మే 18 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికిపైగా మృతిచెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్రక్కును ఢీకొన్న కంటైనర్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా దెబ్బతింది. ఘటనాస్థలిలోనే పదిమందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్‌ హైవేపై ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ విషాద ఘటనతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.. కిషన్‌రెడ్డి ధ్వజం

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 06:31 PM