Share News

తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా, సీజేపీ నేతలపై ఏసీపీ ఫిర్యాదు!

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:46 PM

దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ నేతలు చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు కొత్తమలుపులు తిరిగాయి. ఆ నిరసనల సమయంలో తనపై కుల దూషణలకు పాల్పడ్డారంటూ ఏసీపీ వివేక్ భగత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనపై లైంగిక ఆరోపణలు  చేసిన మహిళా, సీజేపీ నేతలపై ఏసీపీ ఫిర్యాదు!
Jantar Mantar News

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ నేతలు చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు కొత్తమలుపులు తిరిగాయి. ఆ నిరసనల సమయంలో తనపై కుల దూషణలకు పాల్పడ్డారంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) వివేక్ భగత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో సీజేపీ నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాతో పాటు ఓ మహిళా జర్నలిస్ట్ తన పరువుకు భంగం కలిగించారని ఆయన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


అక్టోబర్ 3న జంతర్‌మంతర్‌ వద్ద విధుల్లో ఉన్న ఏసీపీ వివేక్ భగత్‌ను ఉద్దేశించి బూటా సింగ్ రౌండ్‌అబాట్ సమీపంలో సదరు మహిళా జర్నలిస్ట్ కుల దూషణలకు పాల్పడ్డారని, తన నియామకాన్ని ప్రశ్నించారని ఫిర్యాదులో తెలిపారు. ఆ సమయంలో విధులకు ప్రాధాన్యమిచ్చి వారి వ్యాఖ్యలను విస్మరించినట్లు ఆయన చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిరసనకారులను అదుపులోకి తీసుకునే సమయంలో తనపై లైంగిక దాడి చేశారంటూ మహిళా జర్నలిస్ట్ నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.


అంతేకాకుండా, ఆ సాయంత్రం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆమెతో పాటు మరికొందరు నిరసనలు చేపట్టి.. తనను లైంగిక వేధింపులకు పాల్పడేవ వ్యక్తి అంటూ నినాదాలు చేశారని ఏసీపీ వివేక్ భగత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియా పోస్టులు తన పరువు ప్రతిష్ఠలను తీవ్రంగా దెబ్బతీశాయని, తన విధులకు ఆటంకం కలిగించాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సదరు మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు జరుపుతోంది.


ఇవి కూడా చదవండి:

ఏపీ స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

డీజీసీఏ కీలక నిర్ణయం... విమానాల్లో ఆ పవర్‌ బ్యాంకులపై నిషేధం

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

సర్‌కు వ్యతిరేకంగా 2 లక్షల మందితో మార్చ్: టీపీసీసీ చీఫ్

Updated Date - Oct 14 , 2026 | 09:57 PM