Share News

విండీస్‌తో నాలుగో టీ20: హోప్ సెంచరీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Oct 14 , 2026 | 08:48 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్-భారత్ జట్లు నాలుగో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.

విండీస్‌తో నాలుగో టీ20: హోప్ సెంచరీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?
India vs West Indies 4th T20

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్-భారత్ జట్లు నాలుగో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారత్‌కు 248 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ కెప్టెన్ షై హోప్(102*; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.


రుథర్‌ఫోర్డ్(49*;26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. హోప్‌తో కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జెవెల్ ఆండ్రూ(21), హెట్‌మెయర్(33), పావెల్(24) క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వికెట్లు తీయడానికి భారత బౌలర్లు విఫలయత్నాలు చేశారు. ఫీల్డింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపర్చారు. 19వ ఓవర్లో రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మయాంక్ యాదవ్ నేలపాలు చేశాడు. బంతిని అందుకోవడానికి చురుకుగా కదిలే ప్రయత్నం కూడా చేయలేదు. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ తలొక వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్

వెస్టిండీస్‌తో నాలుగో టీ20: ఉప్పల్‌లో మ్యాచ్.. టాస్ నెగ్గిన భారత్

Updated Date - Oct 14 , 2026 | 08:58 PM