Share News

వెస్టిండీస్‌తో నాలుగో టీ20: ఉప్పల్‌లో మ్యాచ్.. టాస్ నెగ్గిన భారత్

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:32 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్-భారత జట్లు నాలుగో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

వెస్టిండీస్‌తో నాలుగో టీ20: ఉప్పల్‌లో మ్యాచ్.. టాస్ నెగ్గిన భారత్
India vs West Indies 4th T20

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్-భారత జట్లు నాలుగో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను పట్టేయాలనే కసితో ఉంది. మరోవైపు గట్టిపోటీనిస్తోన్న విండీస్.. ఉప్పల్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ప్రయత్నిస్తోంది.


భారత తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్


విండీస్ తుది జట్టు:

షై హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), జెవెల్ ఆండ్రూ, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌, షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెఫర్డ్, కీమో పాల్‌, రోస్టన్‌ ఛేజ్‌, షర్మార్‌ స్ప్రింగర్‌, షమార్‌ జోసెఫ్‌, గుడకేశ్‌ మోతీ


ఇవి కూడా చదవండి:

భారీ స్కోర్లు చేయకపోయినా.. అతడు జట్టుకు అవసరం: పుజారా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: కెరీర్‌లోనే బెస్ట్.. నాలుగో స్థానానికి దూసుకొచ్చిన శ్రేయస్

Updated Date - Oct 14 , 2026 | 06:41 PM