Share News

చాలా మంది ఎంపీలు కేవలం చప్పట్లు కొట్టడానికే వస్తారు: శశిథరూర్

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:45 PM

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ తనదైన శైలిలో స్పందించారు. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 543 నుంచి 815 పెంచాలని కేంద్రం యోచిస్తున్న వేళ ఎన్డీయే సర్కార్ ఉద్దేశాలను ప్రశ్నించారు.

చాలా మంది ఎంపీలు కేవలం చప్పట్లు కొట్టడానికే వస్తారు: శశిథరూర్
Shashi Tharoor

ఇంటర్నెట్ డెస్క్: ఎన్డీయే ప్రభుత్వం త్వరలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 132వ సవరణ బిల్లు ద్వారా లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 543 నుంచి 815 పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఉద్దేశాలను ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor)కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందా? లేకా దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తోందా? అంటూ ఆయన ప్రశ్నించారు.


ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శశి థరూర్‌ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆలోచన ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందా? లేక దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ దేశ సంక్షేమం కోసమే అయితే 815 మంది ఎంపీలతో లోక్‌సభ నిర్వహణ సాధ్యమేనా? ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం లభిస్తుందా? అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని శశిథరూర్‌ ప్రశ్నించారు. ఇప్పుడున్న 540 మంది ఎంపీలతోనే సభా నిర్వహణ కష్టంగా ఉందని, జీరో అవర్‌లో చాలా మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం కూడా ఉండడం లేదని వెల్లడించారు. 540 మంది ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే.. అదే సంఖ్య 815కి పెరిగితే ఎంపీలు కేవలం చప్పట్లు కొట్టి వెళ్లడానికి తప్ప ప్రయోజనం శూన్యంమంటూ తనదైన శైలీలో శశి థరూర్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి:

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

ఈ కుక్కకు గోల్డ్ మెడల్.. ఎందుకో తెలిస్తే..

Updated Date - Nov 29 , 2026 | 03:48 PM