Share News

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:49 PM

పార్లమెంట్‌లో కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Chandrababu Naidu

అమరావతి, నవంబరు 29: పార్లమెంట్‌లో కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంట్ ముందుకు రావడం చారిత్రాత్మక సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప సంకల్పంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకెళ్తున్నారని, ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా మహిళా శక్తికి మరింత గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు తనవంతు పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలంతా సమన్వయంతో పనిచేయాలని, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఈరోజు సాయంత్రానికల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కూటమి నుంచి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేదనే మాట రాకూడదని, ప్రతి ఒక్కరూ ఈరోజే ఢిల్లీ చేరుకోవాలని స్పష్టం చేశారు.


డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు ఉంటుందని చంద్రబాబు వివరించారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూశారని గుర్తుచేశారు. తాజా డీలిమిటేషన్ ప్రక్రియలోనూ అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయని అభిప్రాయపడ్డారు. గతంలో బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు సైతం ఇప్పుడు మద్దతు తెలపడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఎంపీలంతా ఎన్డీఏ సూచనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు లభించేలా వ్యవహరించాలని సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 02:16 PM