మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:23 PM
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయపాటి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం పేర్కొన్నారు.
అమరావతి, నవంబర్ 29: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయపాటి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం పేర్కొన్నారు. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజలకు సేవలందించారని.. సుదీర్ఘ ప్రజాసేవతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. రాయపాటి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ నివాళులు అర్పించారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..
'సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గారి మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించిన ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాను. సుదీర్ఘ ప్రజాసేవతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాయపాటి గారికి నా నివాళి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి!
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
అమెరికా సైన్యంపై దాడులు.. ఇరాన్ స్టార్‌లింక్ వినియోగించిందా..