పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి!
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:40 PM
కడప జిల్లాలోని పులివెందులలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాంబే బజార్లో తమిళనాడుకు చెందిన భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది.
కడప, నవంబరు 29: జిల్లాలోని పులివెందులలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాంబే బజార్లో తమిళనాడుకు చెందిన భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా మావటం గ్రామానికి చెందిన ఈ దంపతులు నెల రోజుల క్రితం ఉపాధి కోసం పులివెందులకు వచ్చారు. స్థానికంగా బాంబే బజార్ ప్రాంతంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బాంబే బజార్లోని ఓ భవనం మూడో అంతస్తులో నివాసం ఉంటున్న వీరిద్దరూ విగతజీవులుగా కనిపించడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
దంపతులు ఇద్దరూ ఒకేసారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో ఈ ఘటనకు గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే భార్యాభర్తల మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక మరేదైనా కారణంతో మృతిచెందారా? అనే కోణంలో వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితమే పొట్టకూటి కోసం తమిళనాడు నుంచి వచ్చిన దంపతులు ఇలా విగతజీవులుగా మారడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..