మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
ABN , Publish Date - Nov 29 , 2026 | 02:50 PM
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1943 జూన్ 7న పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో ఆయన జన్మించారు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చారు. 1982 నుంచి 1988 మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 39 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికై యువ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కోశాధికారి, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
1996లో తొలిసారి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1998లో గుంటూరు నుంచి రెండో సారీ గెలుపొందారు. 2004లో మూడోసారి, 2009లో నాలుగోసారి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓడిపోయారు. మొత్తంగా ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే జల వనరుల స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు.
గుంటూరులో ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీ సహా వివిధ విద్యా సంస్థల అభివృద్ధిలో రాయపాటి కీలక పాత్ర పోషించారు. రాయపాటి కుటుంబానికి పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో కూడా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ట్రాన్స్‌స్టోరీ సంస్థతో ఆయన పేరు జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చింది. కాగా.. 2016లో ఆయన భార్య రాయపాటి లీలాకుమారి గుండెపోటుతో చనిపోయారు. రాయపాటి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!