Share News

వెలుగులోకి రాయల ద్వారపాలకుడి శాసనం

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:13 AM

తిరుమల శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలోని దక్షిణ గోడపై విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆసక్తికరమైన శాసనాన్ని పురావస్తు శాఖ గుర్తించింది.

వెలుగులోకి రాయల ద్వారపాలకుడి శాసనం

  • తిరుమల ఆలయ ప్రాకారంపై గుర్తింపు

తిరుమల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలోని దక్షిణ గోడపై విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆసక్తికరమైన శాసనాన్ని పురావస్తు శాఖ గుర్తించింది. కన్నడ భాషలో చెక్కిన ఈ శాసనం 1512 ఆగస్టు 7వ తేదీకి చెందినదిగా నిర్ధారించింది. వీరప్రతాప వీర కృష్ణదేవరాయ భవన ద్వారపాలకుడైన నరసయ్య తన ఇద్దరు సోదరులు తిమ్మయ్య, నరసయ్య, తల్లి బసవమ్మతో కలిసి తిరువేంగళనాథుడైన వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఎల్లప్పుడూ సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తామని ఈ శాసనంలో పేర్కొన్నారు. విజయనగర ఆస్థానంలో రాజభవన ద్వారపాలకుడి పదవి కేవలం సాధారణ సేవకుడి హోదా కాకుండా, కీలకమైన పరిపాలనా స్థానం ఉండేదన్న విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 05:13 AM