Share News

ఈ కుక్కకు గోల్డ్ మెడల్.. ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:14 PM

తన యజమాని ప్రాణాలు కాపాడిన ఓ శునకానికి యూకేలో గోల్డ్ మెడల్ లభించింది. పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్ అనే సంస్థ ఈ మెడల్‌ను కుక్కకు ఇచ్చింది.

ఈ కుక్కకు గోల్డ్ మెడల్.. ఎందుకో తెలిస్తే..
Dog receives PDSA Gold Medal

ఇంటర్నెట్ డెస్క్: తన యజమాని ప్రాణాలు కాపాడిన ఓ శునకానికి యూకేలో గోల్డ్ మెడల్ లభించింది. పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్ అనే సంస్థ ఈ మెడల్‌ను కుక్కకు ఇచ్చింది. బ్రిటన్‌లో ఎంతో పాప్యులర్ అయిన ఈ మెడల్‌ను మనుషులను కాపాడే ప్రయత్నంలో అత్యంత ధైర్యసాహసాలు కనబరిచిన జంతువులకు ఇస్తుంటారు. ఇటీవలే ఆ కుక్క ఈ మెడల్‌ను దక్కించుకుంది.


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ కుక్క పేరు హాలీ. అది జాక్ రసల్ టెరియర్ జాతికి చెందిన శునకం. జనవరి 9న నైజెల్ విట్మోర్, హాలీతో కలిసి వాకింగ్ వెళ్లారు. ఓ సందులో వెళుతుండగా జారిపడి స్పృహ కోల్పోయారు. వెంటనే స్పందించిన హాలీ సాయం కోసం విశ్వప్రయత్నం చేసింది. రోడ్డున పోయే వారి వెంట పడుతూ వారిని విట్మోర్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కుక్క ఎందుకు అంతలా మొరుగుతోందో అర్థం కాక దాని వెంట వెళ్లిన ఓ వ్యక్తి విట్మోర్‌ను గమనించి అత్యవసర సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ప్రాణాలు నిలిచాయి.


విట్మోర్ వెంట హాలీ లేకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగిఉండేదని అక్కడి మీడియా వ్యాఖ్యానించింది. ఉదయం పూట దట్టమైన మంచు కమ్ముకున్న వేళ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో స్పృహ తప్పి ఉన్న విట్మోర్ పరిస్థితి జనాలకు తెలిసే సరికి చాలా ఆలస్యం జరిగి ఉండేది. అయితే, హాలీ పట్టువిడవకుండా వ్యవహరించంతో విట్మోర్ ప్రాణాలు నిలిచాయి. పీడీఎస్ఏ సంస్థ 2002లో ఈ మెడల్‌ను తీసుకొచ్చింది. దీన్ని అక్కడి వారు ప్రతిష్ఠాత్మక జార్జ్ క్రాస్ మెడల్‌తో పోలుస్తారు. ఇప్పటివరకూ హాలీ సహా మొత్తం 32 జంతువులకు ఈ మెడల్ దక్కింది.


ఈ వార్తలనూ చదవండి:

స్మార్ట్ కళ్లద్దాల ‌చోరీ.. తనను తానే రికార్డు చేసుకున్న దొంగ

లంచ్ బ్రేక్‌లోనూ పని చేసిన ఉద్యోగికి ఊస్టింగ్! జరిగిందేంటో తెలిస్తే..

Updated Date - Nov 29 , 2026 | 02:26 PM