Share News

స్మార్ట్ కళ్లద్దాల ‌చోరీ.. తనను తానే రికార్డు చేసుకున్న దొంగ

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:13 PM

కెనడాలోని ఓ షాపులో స్మార్ట్ గ్లాసెస్ చోరీ చేసేందుకు వెళ్లిన దొంగ పొరపాటున తనను తానే రికార్డు చేసుకుని చిక్కుల్లో పడ్డ వైనం ఇటీవల వెలుగు చూసింది.

స్మార్ట్ కళ్లద్దాల ‌చోరీ.. తనను తానే రికార్డు చేసుకున్న దొంగ
Ray Ban Smart Glasses theft in Canada

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని ఓ షాపులో స్మార్ట్ గ్లాసెస్ చోరీ చేసేందుకు వెళ్లిన ఓ దొంగ పొరపాటున తనను తానే రికార్డు చేసుకుని చిక్కుల్లో పడ్డ వైనం ఇటీవల వెలుగు చూసింది. ఓంటారియోలోని సౌత్ సిమ్కో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ దొంగ పొరపాటు గురించి పోలీసులు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కస్టమర్‌లా షాపులోకి వెళ్లిన ఆ దొంగ తాను రేబాన్ గ్లాసెస్ కొనటానికి వచ్చానని చెప్పాడు. ఓసారి రేబాన్ గ్లాసెస్‌ను పెట్టుకుని ఎలా ఉంటుందో చెక్ చేస్తానని సిబ్బందిని అడిగాడు. వారు సరేనని అతడికి వాటిని ఇచ్చారు. అప్పటికే ఆ వ్యక్తి తన వెంట నకిలీ గ్లాసెస్‌ను తెచ్చుకున్నాడు. వారు ఏమరపాటుగా ఉన్న సమయంలో ఫేక్ గ్లాసెస్‌ను ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ పెట్టేశాడు. అసలు కళ్లద్దాలను తీసుకుని ఉడాయించాడు. అతడు వెళ్లాక చోరీ విషయం షాపు సిబ్బందికి అర్థమైంది. దీంతో, ఏం చేయాలో వారికీ మొదట అర్థం కాలేదు.


ఈ క్రమంలో షాపు సిబ్బంది ఆ గ్లాసెస్ లింక్‌ అయి ఉన్న మొబైల్ ఫోన్ పరిశీలిస్తుండగా దొంగకు సంబంధించి చిత్రాలు కనిపించాయి. దొంగ పొరపాటున గ్లాసెస్‌లో రికార్డింగ్ ఫీచర్‌ను ఆన్ చేయడంతో మొబైల్‌ ఫోన్‌లో అతడి వీడియో రికార్డయ్యింది. ఈ విషయాలను గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఫొటోను షేర్ చేసిన పోలీసులు అతడి ఆచూకీ గురించి తెలిసిన వారు తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

లంచ్ బ్రేక్‌లోనూ పని చేసిన ఉద్యోగికి ఊస్టింగ్! జరిగిందేంటో తెలిస్తే..

ఈ బీచ్‌లకు తిరుగులేదు!

Updated Date - Nov 29 , 2026 | 01:36 PM