Share News

లంచ్ బ్రేక్‌లోనూ పని చేసిన ఉద్యోగికి ఊస్టింగ్! జరిగిందేంటో తెలిస్తే..

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:42 AM

ఆఫీసు నుంచి త్వరగా వెళ్లాలనే ప్రయత్నంలో కొత్త పంథాను అనుసరించిన ఓ ఉద్యోగి తన జాబ్ పోగొట్టుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది.

లంచ్ బ్రేక్‌లోనూ పని చేసిన ఉద్యోగికి ఊస్టింగ్! జరిగిందేంటో తెలిస్తే..
Employee Fired for leaving early

ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసు నుంచి త్వరగా వెళ్లాలనే ప్రయత్నంలో కొత్త పంథాను అనుసరించిన ఓ ఉద్యోగి తన జాబ్ పోగొట్టుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు పరిచయమున్న వ్యక్తికి ఎలాంటి అనుభవం ఎదురైందో చెబుతూ ఓ నెటిజన్ ఈ ఉదంతాన్ని షేర్ చేశారు.


ప్రతీక్ షెట్టీ అనే వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో ఈ ఉదంతం గురించి చెప్పారు. త్వరగా విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగి లంచ్ బ్రేక్‌లో కూడా పని చేసి చివరకు చేతులు కాల్చుకున్నాడని చెప్పారు. అతడు తన డెస్క్ ముందే లంచ్ చేస్తూ పని కూడా చేయడం చూసిన యాజమాన్యానికి తిక్కరేగి చివరకు జాబ్‌లోంచి తీసేసిందని అన్నారు. కంపెనీ నిర్ణయం సబబే అయినా మరీ అంతకటువుగా ఉండాల్సింది కాదని ప్రతీక్ షెట్టి అభిప్రాయపడ్డారు. ముందస్తు హెచ్చరికలు ఏవీ లేకుండా, కనీసం ఉద్యోగి వివరణ కూడా తీసుకోకుండానే జాబ్‌లోంచి తొలగించారని అన్నారు.


ఆ ఉద్యోగి తన సీటు వద్దే లంచ్ చేస్తూ పని కూడా చేసే వాడని చెప్పారు. పలుమార్లు ఇలా చేసి త్వరగా పనులు పూర్తి చేసుకుని ఆఫీసు టైమింగ్స్ కంటే ముందే ఇంటికి వెళ్లాడని అన్నారు. పలు మార్లు ఇలా చేయడంతో కంపెనీ దృష్టిలోకి వెళ్లి చివరకు ఆ ఉద్యోగి జాబ్ పోగొట్టుకున్నాడని చెప్పారు. ఘాటపదజాలంతో కంపెనీ అతడికి ఈమెయిల్ చేసి ఉద్యోగం నుంచి తొలగించిందని తెలిపారు. అతడిని చూసి మిగతా ఉద్యోగులు కూడా అలాగే చేయడం ప్రారంభించారని కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. త్వరగా పని పూర్తి చేసినంత మాత్రాన ఆఫీస్ సమయాలకు ముందే ఇంటికి వెళ్లిపోయే హక్కు ఉద్యోగులకు ఉండదని కంపెనీ ఘాటుగా ఈమెయిల్‌లో రాసిందని అన్నారు. ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

ఈ బీచ్‌లకు తిరుగులేదు!

పెరూలో భారతీయుడిపై దుండగుల కాల్పులు.. భారీగా బంగారం దోపిడీ

Updated Date - Nov 29 , 2026 | 12:03 PM