Share News

రాహుల్‌కు మతిస్థిమితం దెబ్బతింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Sep 25 , 2026 | 07:40 PM

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వరుసగా ఓడిపోతుండడంతో రాహూల్‌కు మతిస్థిమితం తప్పినట్లుందని ఎద్దేవా చేశారు.

రాహుల్‌కు మతిస్థిమితం దెబ్బతింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
kishan reddy cunters rahul gandhi

ఇంటర్నెట్ డెస్క్: మోదీ- అమిత్‌షాలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండడంతో రాహుల్‌కు మతిస్థిమితం తప్పినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ప్రధాని మోదీ గురించి అనుచితంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.


రాజ్యాంగ సంస్థలను అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని కించపరచడం, ప్రభుత్వ విదేశీవిధానాన్ని, దౌత్య సంబంధాలను విమర్శించడం, మోదీ వ్యక్తిగత సంబంధాల గురించి అనుచితంగా మాట్లాడడం సమంజసనీయం కాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్లు.. లేకుంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నట్లా.. అని నిలదీశారు. ప్రజాస్వామ్యంపై రాహుల్‌ పాఠాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి..

వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 07:57 PM