డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:55 PM
డీలిమిటేషన్‌తో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్‌లో జరిగిన ప్రత్యేక భేటీలో కేబినెట్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 27: డీలిమిటేషన్‌తో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్‌లో జరిగిన ప్రత్యేక భేటీలో కేబినెట్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మరోవైపు డీలిమిటేషన్ తర్వాత ఏ రాష్ట్రమూ తన లోక్‌సభ సీట్ల నిష్పత్తి కోల్పోకుండా కేంద్రం బిల్లును సవరించిందని సమాచారం. వచ్చే వారం జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది.
కాగా డీలిమిటేషన్‌తో కూడిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఏప్రిల్‌లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టగా.. అది వీగిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కేంద్రం పట్టు మీద ఉంది. ఈ క్రమంలో సంఖ్యాబలం పెంచుకునే చర్యలు ఇప్పటికే తీసుకుంది. బిల్లులో కీలక మార్పులు చేసింది. ఈ సవరించిన బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ, బీఆర్ఎస్, వైసీపీ తదితర పార్టీలు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తృణమూల్ నుంచి చీలిన ఎంపీలూ కేంద్రం పక్షాన నిలుస్తారని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఈ సారి ఉభయ సభల్లో 2/3 మెజారిటీకి సరిపడా సంఖ్యాబలం ఉండబోతోందని బీజేపీ కరాఖండిగా చెబుతోంది. అయితే విపక్ష ఇండి కూటమి మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాన్ని రచించే పనిలో పడింది. ఇందుకోసం రేపు (శనివారం) ఆ కూటమి నేతలు భేటీ కానున్నారు.
ఈ వార్తలూ చదవండి
డీలిమిటేషన్ ఆమోదానికి మ్యాజిక్ ఫిగర్ 360.. మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం