Share News

ఇథనాల్‌ పెట్రోల్‌పై దుష్ప్రచారం.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 02:17 PM

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

ఇథనాల్‌ పెట్రోల్‌పై దుష్ప్రచారం.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

ఇంటర్నెట్ డెస్క్: ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న కంటెంట్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎక్స్, మెటాలలో ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇందులో ఏఐ ఆధారంగా క్రియేట్ చేసిన కంటెంట్‌ కూడా ఉందని పేర్కొంది.


సంబంధిత కంటెంట్‌ను ఎవరు సృష్టించారు? ఎవరు అప్‌లోడ్‌ చేశారు? అనే వివరాలను తమకు అందజేయాలని ఎక్స్, మెటా సంస్థలను బాంబే హైకోర్టు ఆదేశించింది. సోషల్‌ మీడియా వేదికలపై తప్పుడు సమాచారం, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, ఏఐ ఆధారిత కంటెంట్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాంకేతికత అభివృద్ధి సహా ఏఐ బేస్‌డ్ కంటెంట్‌ వినియోగం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా చర్యలు చేపట్టాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.


ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 05 , 2026 | 02:17 PM