టీ కార్మికులకు గుడ్‌న్యూస్.. 20 శాతం బోనస్..
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:54 PM
అస్సాలోని తేయాకు కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీ కార్మికులకు దుర్గాపూజను పురస్కరించుకుని 20 శాతం ప్రత్యేక బోనస్‌ను అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాలోని తేయాకు కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీ కార్మికులకు దుర్గాపూజను పురస్కరించుకుని 20 శాతం ప్రత్యేక బోనస్‌ను అందిస్తున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 800లకు పైగా తేయాకు తోటల్లో పనిచేస్తున్న సుమారు 10 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
దసరా నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని తేయాకు కార్మిక సోదరసోదరీమణులకు ఈ ఆనందాన్ని కానుకగా అందిస్తున్నట్లు సీఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగను మరింత ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకునేందుకే ఈ ప్రత్యేక బోనస్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో అస్సాం రాష్ట్రంలో దుర్గాపూజ అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండగ. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వార్షిక బోనస్ కార్మికుల కుటుంబాల గృహోపకరణాల, పండగ ఖర్చులకు ఎంతో ఊతమిస్తుంది.
భారత దేశం మొత్తం తేయాకు ఉత్పత్తిలో అస్సాం దాదాపు 55 శాతం వాటాను కలిగి ఉంది. ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తేయాకు పరిశ్రమనే ప్రధాన వెన్నెముకగా ఉంది. ఏటా పండగ వేళ ప్రభుత్వం ప్రకటించే ఈ ఆర్థిక ఊతంతో కార్మిక కుటుంబాలు సంతోషంగా వేడుకను జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తుందని స్థానికులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!
ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ. 204 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం