బలహీన వర్గాలకి అధికారం రావడం ఇష్టపడని గొడ్డలి పార్టీ: మంత్రి ఆనం
ABN , Publish Date - Oct 13 , 2026 | 08:52 PM
రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. వైసీపీ చర్యలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నెల్లూరు, అక్టోబర్ 13: రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. వైసీపీ చర్యలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి ఆనం మాట్లాడుతూ.. ప్రజలపై రప్ప రప్ప భాషతో బెదిరింపులకి పాల్పడుతున్నారని వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు.
తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పార్టీని ఎప్పుడు చూడలేదని అన్నారు. బలహీన వర్గాలకి అధికారం రావడం గొడ్డలి పార్టీ వాళ్లకి ఇష్టం లేదని చెప్పారు. సీఎం చంద్రబాబు బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించారని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు అధికారం రాకుండా గొడ్డలి పార్టీ అడ్డుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
విజయవాడ ఉత్సవ్‌కు వచ్చి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సీఎం విజయ్: సీఎం చంద్రబాబు
ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telugu News