జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:18 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) షెడ్యూల్ ఖరారు చేసింది. బుధవారం ఉదయం11.30 గంటలకు ఈ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
అమరావతి, అక్టోబర్ 13: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) షెడ్యూల్ ఖరారు చేసింది. బుధవారం ఉదయం11.30 గంటలకు ఈ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. మొత్తం మూడు దశల ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా బుధవారం విడుదల చేస్తారు.
ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి గెజిట్ నోటిఫికేషన్లు.. ఎన్నికల కమిషన్‌కు చేరాయి. తొలి దశలో పట్టణ స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చేపట్టనున్నారు. మూడో దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు.
జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు..
ఏపీ జడ్పీ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళవారం రాత్రి విడుదల చేసింది.
అనకాపల్లి జిల్లా: బీసీ మహిళ
అనంతపురం జిల్లా: బీసీ జనరల్
అన్నమయ్య జిల్లా: అన్ రిజర్వ్‌డ్
అల్లూరి జిల్లా: ఎస్టీ
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాలు: ఓసీ మహిళ
కోనసీమ, గుంటూరు జిల్లాలు: ఎస్సీ మహిళ
కర్నూలు జిల్లా: బీసీ జనరల్, ఎన్టీఆర్ జిల్లా: ఎస్సీ.
మార్కాపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలు: ఓసీ జనరల్
పల్నాడు జిల్లా: ఓసీ మహిళ
పోలవరం జిల్లా: ఎస్టీ మహిళ
పశ్చిమగోదావరి, నెల్లూరు, కడప జిల్లాలు: ఓసీ జనరల్
శ్రీకాకుళం జిల్లా: బీసీ మహిళ.
తిరుపతి జిల్లా: ఎస్సీ మహిళ
విజయనగరం, విశాఖపట్నం జిల్లా: బీసీ
ఇవి కూడా చదవండి..
బలహీన వర్గాలకి అధికారం రావడం ఇష్టపడని గొడ్డలి పార్టీ: మంత్రి ఆనం
విజయవాడ ఉత్సవ్‌కు వచ్చి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సీఎం విజయ్: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News