మమతా బెనర్జీపై హత్యాయత్నం.. టీఎంసీ ఆరోపణ
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:15 PM
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గుర్తుతెలియని మహిళ హత్యాయతానికి పాల్పడిందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఆరోపించారు. కోల్‌కతాలోని మమత నివాసం కాళీఘాట్‌లో ఈ ఘటన జరిగిందని వారు పేర్కొన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గుర్తుతెలియని మహిళ హత్యాయతానికి పాల్పడిందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఆరోపించారు. కోల్‌కతాలోని మమత నివాసం కాళీఘాట్‌లో ఈ ఘటన జరిగిందని వారు పేర్కొన్నారు. టీఎంసీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గా పూజ మంటపాన్ని ఆవిష్కరించేందుకు మమత తన నివాసం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో గుర్తుతెలియని మహిళ దూసుకొచ్చి మమతా బెనర్జీ చీరను ఆమె లాగేందుకు యత్నించారు.
అయితే, వెంటనే అక్కడున్న టీఎంసీ కార్యకర్తలు, నేతలు ఆ మహిళను అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పరిశీలించగా.. ఆ మహిళ దుస్తుల్లో దాచిపెట్టిన కత్తి బయట పడింది. ఆ మహిళను కాళీఘాట్ పోలీసులకు అప్పగించారు. కాగా.. మమతా బెనర్జీకి కల్పించిన భద్రతా ఏర్పాట్లపై టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఘటనతో ఆమె భద్రతా ఏర్పాట్లపై సందేహాలు నెలకొన్నాయని, మాజీ సీఎంకు వెంటనే భద్రత పెంచాలని టీఎంసీ నేతలు కోరారు.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి