Share News

సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక!

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:50 PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీకి రాజ్యాంగపరమైన రక్షణ లేదని, ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయకపోతే అభిశంసన తప్పదని ఆయన హెచ్చరించారు.

సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక!
Shashi Tharoor

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీకి రాజ్యాంగపరమైన రక్షణ లేదని, ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయకపోతే ప్రతిపక్షాలన్నీ కలిసి అభిశంసన (Impeachment) తీర్మానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయని శశిథరూర్ స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా తొలగించిన ఓట్లను మళ్లీ పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రక్రియకు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా సమీక్షించాలని విపక్షాలు కోరుతున్నట్లు ఎంపీ శశిథరూర్ తెలిపారు.


2023 చివరిలో బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన చట్టం ద్వారానే ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన మినహాయింపు (Legal Immunity) లభించిందే తప్ప, వారికి ఎలాంటి రాజ్యాంగ రక్షణ లేదని కాంగ్రెస్ ఎంపీ గుర్తుచేశారు. పార్లమెంటరీ శీతాకాల సమావేశాల సమయంలో ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసిన తర్వాతే ఈ చట్టాన్ని ఆమోదించారని విమర్శించారు. ప్రతిపక్షాల విశ్వాసాన్ని కోల్పోయిన సీఈసీ.. ప్రజాస్వామ్య కోసం నైతిక విలువలతో స్వతహాగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం అభిశంసన ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తుందని శశిథరూర్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

Updated Date - Oct 13 , 2026 | 07:17 PM