Share News

సీఈసీలకు కాంగ్రెస్ లంచమిచ్చింది.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:52 PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతోన్న తరుణంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఈసీలకు కాంగ్రెస్ లంచమిచ్చింది.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు
Piyush Goyal

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని ఇండియా కూటమి, సీజేపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ కనుసన్నల్లోనే సీఈసీ పని చేస్తుందటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal)కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పద్మ అవార్డులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్లకు (CEC) లంచం ఇచ్చిందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్నికల కమిషనర్లందరూ స్వతంత్రంగా పనిచేశారన్నారు.


మంగళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ...'కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన అధికారులకు.. పదవీ విరమణ అనంతరం రాజకీయ పదవులు, పద్మ అవార్డులు ఇచ్చి ప్రయోజనం చేకూర్చింది. అవార్డుల పేరిట సీఈసీలకు లంచం ఇచ్చింది. సీఈసీ విషయంలో గత కొన్నిరోజులుగా రాహుల్ గాంధీ (Rahul Gandhi)ద్వంద్వ వైఖరి, పిల్ల చేష్టలను చూస్తున్నాం. ఆయన పార్టీ(కాంగ్రెస్) ఈసీలకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చింది. మాజీ ఎన్నికల కమిషనర్ టి.ఎన్. శేషన్‌ను ఎల్‌కే ఆడ్వాణీకి వ్యతిరేకంగా నిలబెట్టింది' అని ఆయన గుర్తు చేశారు.


'అలానే మాజీ సీఈసీ ఎంఎస్‌ గిల్‌కు పద్మ విభూషణ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉన్న ఈసీలందరికీ ప్రయోజనం చేకూర్చింది. 1986లో ఆర్కే త్రివేదిని గుజరాత్ గవర్నర్‌గా నియమించింది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంబంధిత వర్గాలు ఎవరితోనూ సంప్రదింపులు, చర్చలు లేకుండా సీఈసీ నియామకాలు చేపట్టేది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023లో ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది (Election Commission). ఈ చట్టం కింద ప్రతిపక్ష నాయకుడు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు’ అని గోయల్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

Updated Date - Oct 13 , 2026 | 06:03 PM